భారత్ కు రానున్న 15వ శతాబ్దం నాటి సీతారాముల విగ్రహాలు


భారత దేశపు సంస్కృతీ సంప్రదాయాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. మన దేశంలోని శిల్పకళకు విదేశీయులు సైతం మంత్రముగ్దులవుతుంటారు. మన దేశ శిల్పకళకు శిల్పుల నైపుణ్యానికి ఎన్నో ప్రసిద్ధ ఆలయాలు నిలువెత్తు తార్కాణాలుగా నిలిచాయి. అయితే కాలగమనంలో దేవాలయాల్లోని ఎన్నో విలువైన విగ్రహాలు చోరీకి గురై విదేశాలకు తరలివెళ్లాయి. అయితే వాటి జాడను గుర్తించిన భారత ప్రభుత్వం రాణి-కి వావ్ బుద్ధుడి కాంస్య విగ్రహం 17వ శతాబ్ధపు కృష్ణుడి విగ్రహం సహా విలువైన భారతీయ సాంస్కృతిక సంపద స్వదేశానికి చేర్చడంలో సఫలమైంది. ఈ క్రమంలోనే 15వ శతాబ్ధం నాటి సీతారాములు లక్ష్మణుడు హనుమంతుడుల వారి విగ్రహాలను లండన్ నుంచి తిరిగి తెప్పించేందుకు భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 1978లో తమిళనాడులోని విజయనగర కాలంలో నిర్మించిన ఆలయంనాటి విగ్రహాలు త్వరలోనే మన దేశానికి తీసుకువచ్చేందుకు లండన్లోని భారత హైకమిషన్ ఇండియా `ప్రైడ్ ప్రాజెక్ట్ `ద్వారా తేనున్నారు.