గ్యాస్ లీకైనప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు !

నాడు భోపాల్ గ్యాస్ లీక్.. 10వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత దాని పర్యవసనాలకు మొత్తంగా 25వేల మంది అసువులు బాసారు. నేడు విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి లీకైన స్టెరిన్ గ్యాస్ కారణంగా ఇప్పటివరకు 8మంది చనిపోయారు. 200 మందికిపైగా సీరియస్ గా ఉన్నారు. ఈ గ్యాస్ లీక్ తో సుమారు ఐదు గ్రామాల ప్రజలు అత్యంత దయనీయ పరిస్థితి లో ఉన్నారు.


చరిత్రలో భోపాల్ ఘటన పెను విషాదం.. అది   ప్రపంచంలోనే ఇప్పటి వరకు జరిగిన పారిశ్రామిక ప్రమాదాల్లో ఇదే అత్యంత భయానకమైంది. ఓ చిన్నారి మరణించిన ఫొటో ప్రపంచాన్ని కంటతడి పెట్టించి వైరల్ అయ్యింది.  


నాడు భోపాల్.. నేడు విశాఖ అయినా మన ప్రభుత్వాలు.. పరిశ్రమలు ఇంకా మేలుకోవడం లేదు. కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. గ్యాస్ లీక్ అయినప్పుడు మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో నిపుణులు సూచిస్తున్న విషయాలివీ..


* గ్యాస్ లీకైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలివీ..
* గ్యాస్ లీక్ అయ్యి అస్వస్థతకు గురికాగానే భయపడకుండా వెంటనే వైద్యసహాయం తీసుకోవాలి
* గ్యాస్ లీక్ తో కళ్లు మొదట మండుతాయి.. చల్లటి నీటితో కడగాలి
* ఇంట్లో ఉంటే తలుపులు కిటికీలు మూసేయండి.. గాలి రాకుండా బెడ్ షీట్లను అడ్డుగా పెట్టి టైట్ గా తలుపులు బిగించండి.
* ఇక గ్యాస్ కు గురైనప్పుడు మాట్లాడడం మానుకోవాలి. గాలి తక్కువగా పీల్చాలి.
* గ్యాస్ లీక్ అయితే వెంటనే ఇళ్లలోకి వెళ్లి దాక్కోవాలి.
* కర్ఛీఫ్ లు ముఖానికి మాస్కులు టవల్స్ కట్టుకొని తడిపి కట్టుకుంటే ఇంకా ఫలితం బాగుంటుంది. గ్యాస్ నుంచి కాపాడుతుంది.
* ఇక గ్యాస్ వచ్చే దిశకు వ్యతిరేక దిశలో నిలబడాలి. అటువైపు కదలాలి.