గుంటూరు జీజీహెచ్ వైద్యురాలు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. నాలుగేళ్ల చిన్నారి పొట్ట నుంచి సూది బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. ఆస్పత్రిలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సబిన్‌కర్ బాబూలాల్ మీడియాకు వివరాలు వెల్లడించారు. గుంటూరు నగరంలోని పొత్తూరు వారి తోటకు చెందిన మహ్మద్ అబెదుల్లా, సాజియా దంపతుల నాలుగేళ్ల కుమార్తె షీమా సోమవారం ఇంటి వద్ద ఆడుకుంటూ చేతికి అందిన సూదిని మింగేసింది. గమనించిన తల్లిదండ్రులు చిన్నారిని వెంటనే గుంటూరు జీజీహెచ్‌కు తీసుకువచ్చారు.
సూది మింగిన చిన్నారి